: ప్రయాణాల సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి: రుద్రపాకలో చంద్రబాబు
నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న పిన్నమనేని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఉదయం రుద్రపాకకు వచ్చిన చంద్రబాబు, ఇంత పెను ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ప్రయాణాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లే వారు వీలైనంత వరకూ రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చారు. పిన్నమనేని కారు ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన చంద్రబాబు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.