: కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం... 'నీట్'పై ఆర్డినెన్సే ప్రధాన ఎజెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యింది. ప్రధాని అదికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్డులో జరుగుతున్న ఈ భేటీలో, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన 'నీట్' (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నీట్ ను వచ్చే ఏడాది నుంచి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో నీట్ ను ఈ ఏడాది వాయిదా వేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.