: యువతులపై ఆన్ లైన్ వేధింపులు ఇక క్రిమినల్ కేసే!: మేనకా గాంధీ


ఆడవాళ్ల గురించి ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేస్తేనే ప్రస్తుతం క్రిమినల్ కేసుగా పరిగణిస్తుండగా, ఇకపై ఆన్ లైన్లో (సామాజిక మాధ్యమాలలో) దూషించినా నేరంగా భావిస్తూ, విచారణ జరిపి శిక్షించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. యువతులపై ఆన్ లైన్లో వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దిశగా చట్టాన్ని మార్చాలని భావిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. మహిళలపై ఆన్ లైన్ వేధింపుల విషయంలో వెబ్ సైట్ సంస్థలు విచారణకు సహకరించేందుకు అంగీకరించలేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని ఆమె తెలిపారు. ఇప్పటికే నెటిజన్ల ఆన్ లైన్ వ్యవహారాలపై నియమ నిబంధనలు రూపొందించాలని హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు ఆమె వివరించారు. గర్భవతులైన వారు తమకు ఎనిమిది నెలల సెలవు కావాలని కోరుతూ, ఈ మేరకు నిబంధనలను సవరించాలని తనకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని, ఈ విషయాన్ని సైతం క్యాబినెట్ లో చర్చిస్తామని మేనకా గాంధీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News