: యోగా డే సందర్భంగా ‘ఓం’ వివాదం: తప్పనిసరి కాదు.. ఇష్టం లేని వారు ఆ సమయంలో మౌనంగా ఉండొచ్చని స్పష్టం చేసిన ఆయుష్
వచ్చే నెల 21వ తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా చెలరేగుతోన్న ‘ఓం’ ఉచ్చారణ వివాదంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. 45 నిమిషాల యోగా సెషన్ ప్రారంభించడానికి ముందు ఓం పలకాలని, వేద మంత్రాలను చదవాలని కేంద్రం ప్రతిపాదించిన అంశాన్ని పూర్తిగా ఖండించకుండా ‘ఓం’కారాన్ని ఉచ్చరించడం తప్పనిసరి కాదని, ఇష్టం ఉన్న వారే పలకొచ్చని, మిగతా వారు ఆ సమయంలో మౌనంగా ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు యోగా సెషన్‌లో ముందుగా నిర్ణయించిన సమయాన్ని మరో పదినిమిషాలు పెంచుతూ కొత్త ఆసనాన్ని, ధ్యానం, ప్రాణాయామాన్ని కలుపుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది.