: మూడు నెలల్లో వీరప్పన్‌పై పుస్తకం వెలువరిస్తా!: విశ్రాంత పోలీస్ అధికారి శంకర్ బిదిరి
భారత్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌గా పోలీసులనే ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ పై విశ్రాంత పోలీసు అధికారి శంకర్ బిదిరి పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. వీరప్పన్ గురించి ప్రజలకు ఇంతవరకు తెలియని సమాచారాన్ని దానిలో వెల్లడిస్తానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరప్పన్ ని పట్టుకోవడానికి తాము చేసిన శ్రమని, ఎదుర్కున్న ఓటములను ఈ పుస్తకం ద్వారా ప్రజల ముందుంచుతానని ఆయన పేర్కొన్నారు. వీరప్పన్ గురించి ఎన్నో విషయాలు ప్రజలకి తెలియవని తాను రచిస్తోన్న పుస్తకం ద్వారా వాటి గురించి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.