: కోపంతో ఊగిపోయిన సోనాక్షీ సిన్హాకు ఊహించని విధంగా 'ద యాంగ్రీన్' అవార్డు
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా గతంలో కోపంతో చేసిన ఓ వ్యాఖ్య ఆమెకిప్పుడు ఊహించని అవార్డును దగ్గర చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, సోనాక్షి సైబర్ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘వేధింపులు ఎలా ఉన్నా తప్పే... ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడాలి. ధైర్యంగా, నిజాయతీగా ఉండాలి’ అని యువతులకు సలహా ఇచ్చింది. ఇక వచ్చే వారంలో ఇండియాలో విడుదల కానున్న కామిక్ ఫిల్మ్ ‘ద యాంగ్రీ బర్డ్స్’ కోసం సినిమా యూనిట్ చేస్తున్న ప్రచారంలో భాగంగా ఏదైనా ఓ అంశంపై అత్యంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ స్పందించిన వారికి అవార్డును ఇవ్వాలని భావించారు. ఆపై నెట్ లో వెతికితే సోనాక్షి వ్యాఖ్యలే బాగున్నాయని తెలిసి, ఆమెకు అవార్డు ఇచ్చేశారు. అదీ సంగతి!