: చెన్నైలో వర్షం... నెల్లూరులో నిలిచిన వంశీకృష్ణ ట్రావెల్స్ బస్సు


అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో, లేదో... తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వరుణ దేవుడు ముంచెత్తాడు. గతేడాది చెన్నై సహా పలు జిల్లాలను నీట ముంచిన వరుణుడి విలయం మళ్లీ తప్పదా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిరుటి ఘటనలు గుర్తుకు వచ్చాయో, ఏమో... తెలియదు కాని నిండా ప్రయాణికులతో విశాఖ నుంచి నిన్న రాత్రి చెన్నై బయలుదేరిన వంశీకృష్ణ ట్రావెల్స్ బస్సు నెల్లూరు జిల్లాలో నడిరోడ్డుపైనే నిలిచిపోయింది. బస్సు నిలిచిపోవడానికి సాంకేతిక కారణాలేమీ లేవు. డ్రైవర్ భయమే బస్సును నిలిపేసింది. బస్సును కదిలించమన్న ప్రయాణికుల విజ్ఞప్తిని డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయని చెబుతున్న డ్రైవర్ తాను బస్సును చెన్నైకి చేర్చలేనని చెప్పేశాడు. దీంతో ప్రయాణికులు నడిరోడ్డుపైనే నిలిచిపోయారు.

  • Loading...

More Telugu News