: తెలుగుదేశం ఎంపీ తోట నరసింహం అరెస్టుకు ఆదేశాలు!


ఓ స్థల వివాదంలో యజమాని కుమార్తెల నగ్న చిత్రాలను తీసి వాటిని బయటపెట్టి పరువు తీస్తానని బెదిరిస్తున్న కేసులో తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నరసింహంను అరెస్ట్ చేయాలని ఆదేశించినట్టు ఉమ్మడి రాష్ట్ర బాలల హక్కుల సంఘం వెల్లడించింది. 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్' కింద కేసు పెట్టి 24 గంటల్లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్టు సంఘం సభ్యుడు అచ్యుతరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నానికి చెందిన నాయ్యవాది సూరవరపు వెంకట రవికుమార్‌ కు కాకినాడ పరిధిలో విలువైన భూమి ఉండగా, దాన్ని కాజేయాలని ఎంపీ, అతని అనుచరులు ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన రవికుమార్ పెద్ద కుమార్తెకు ఎక్స్ రే తీయించాలన్న నెపంతో బట్టలు మార్చుకోవాలని చెప్పి ఫోటోలు తీశారని, ఆపై చిన్న కుమార్తెను ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పి సెలవు రోజున స్కూలుకు పిలిపించి, అక్కడి టీచర్ తోట సత్యానందం నగ్నంగా చిత్రాలు తీశారని ఆరోపించారు. స్థలం తమకు ఇవ్వకుంటే, వీటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తున్నారని బాధితుడు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు సీఎం, హోం మంత్రి, డీజీపీలకు నోటీసులు పంపినట్టు అచ్యుతరావు తెలిపారు.

  • Loading...

More Telugu News