: నాకు ప్రైవసీ లేదు... అందరి దృష్టి నాపై ఉండటం ఇష్టముండదు: క్రికెటర్ కోహ్లి
‘నాకు ప్రైవసీ లేదు. అందరి దృష్టి నాపై ఉండటం నాకు ఇష్టముండదు’ అని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ లైఫ్ అనేది హోటల్ రూమ్ కే పరిమితమన్నాడు. నిత్య జీవితంలో ఒక యోగిలా జీవించాలనుకుంటానంటూ కోహ్లి ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడాడు. నిత్యజీవితంలో అంటీముట్టనట్లు ఉండాలనేది తన సిద్ధాంతమని, నిరాడంబర జీవితం గడుపుతానని కోహ్లి తన మనసులో మాట చెప్పాడు.