: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు.. కంచ ఐలయ్యపై కేసు నమోదు


విజయవాడ కేంద్రంగా జ‌రిగిన‌ ఓ కార్యక్రమంలో దళిత హక్కుల కార్యకర్త, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య హిందూ దేవ‌తల‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో హైద‌రాబాద్, స‌రూర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఆయనపై కేసు న‌మోదైంది. లాయ‌ర్ క‌రుణసాగ‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో 295-A, 298, 153-A సెక్షన్ల కింద కంచ ఐలయ్య‌పై కేసు నమోదు చేశారు. కాగా, బ్రాహ్మ‌ణులు, హిందూ దేవ‌త‌లపై ఇటీవ‌ల తాను చేసిన వ్యాఖ్యల‌కు క్ష‌మాపణ‌లు చెబుతున్న‌ట్లు కంచ ఐల‌య్య ఈరోజు ఉద‌యం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News