: గవర్నర్ నరసింహన్ ఇంటికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కొద్దిసేపటి క్రితం కలుసుకున్నారు. రాజ్ భవన్ కు వచ్చిన కేసీఆర్ గవర్నర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాజా రాజకీయాలపై వారిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అవతవణ దినోత్సవం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా గవర్నర్ కు కేసీఆర్ నివేదించినట్టు తెలుస్తోంది. కేసీఆర్, నరసింహన్ ల మధ్య సమావేశం ఇంకా కొనసాగుతోంది.