: ఆ ఆహ్వాన పత్రికలో ఏపీ మంత్రుల ఫొటోలు పెట్టి.. చంద్రబాబు ఫొటోను మరిచారు!


ఆ ఆహ్వాన పత్రికలో ఏపీ మంత్రులు, మున్సిపల్ అధికారుల ఫొటోలు ఉన్నాయి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో మాత్రం లేదు. దీనికి కారణం, కేవలం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనంటున్నారు టీడీపీ నేతలు. పెద్దాపురం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన పత్రికను సంబంధింత శాఖాధికారులు తయారు చేశారు. ఆ ఆహ్వానపత్రికలో మంత్రులు చిన రాజప్ప, నారాయణతో పాటు మున్సిపల్ అధికారుల ఫొటోలు అందులో ఉన్నాయి. అయితే, సీఎం చంద్రబాబు పేరు మాత్రం రాసి, ఆయన ఫొటో లేకుండా ఈ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. దీంతో, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఇదెట్లా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News