: వంటలు నేర్చుకుంటున్న బాలీవుడ్ హీరో!


బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వంటలు నేర్చుకుంటున్నాడు. ఈ వంటలు ఇంట్లో కూర్చుని నేర్చుకోవట్లేదు .. ఆరితేరిన పాకశాస్త్ర నిపుణులతో కలిసి గరిటె తిప్పుతున్నాడు. ఇంతకీ, గరిటె తిప్పే కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టాడంటే... త్వరలో తాను నటించనున్న ఒక చిత్రంలో ‘చెఫ్’ పాత్రలో సైఫ్ నటించనున్నాడు. ఈ పాత్రలో సహజంగా నటించేందుకు గాను ప్రపంచంలోని టాప్ చెఫ్ ల వద్ద పాకశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నాడు. 2014లో కామెడీ డ్రామాతో రూపొందిన ‘చెఫ్’ హాలీవుడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాజాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో నిజమైన చెఫ్ లా సైఫ్ కన్పించేలా రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటున్నాడని చెప్పారు. కాగా, ప్రస్తుతం ‘రంగూన్’ చిత్రంలో సైఫ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ‘చెఫ్‘ హిందీ రీమేక్ లో నటించనున్నాడు.

  • Loading...

More Telugu News