: డీఎంకేకు అనుకూల వార్తలతో సన్ టీవీ వాటాలను ఎగబడి కొనేసిన ఇన్వెస్టర్లు... 52 వారాల గరిష్ఠానికి!


తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు, సన్ టీవీ నెట్ వర్క్ ఈక్విటీ వాటాల విలువను అమాంతం పెంచేశాయి. కరుణానిధి మేనల్లుడు కళానిధి మారన్ నేతృత్వంలో నడుస్తున్న సంస్థ వాటా విలువ ఏకంగా 10 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు సన్ టీవీ వాటాలను సొంతం చేసుకునేందుకు పెద్దఎత్తున ప్రయత్నించారు. మొత్తం 25.8 లక్షల వాటాలు చేతులు మారగా, సన్ టీవీ వాటా విలువ రూ. 436ను తాకింది. డీఎంకే విజయం సాధిస్తే, తమిళనాట కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ఊపందుకుంటుందన్న అంచనాలున్నాయని బ్రోకరేజి సంస్థ ఎలారా కాపిటల్ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News