: ప్రధానితో ముగిసిన చంద్రబాబు భేటీ!... వివరాల కోసం సర్వత్ర ఆసక్తి!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. నేటి ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధానమంత్రిత్వ కార్యాలయం సౌత్ బ్లాక్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లతో కలిసి భేటీకి సిద్ధంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు... ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించారు. కొద్దిసేపటి క్రితం భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు నోటి నుంచి ఎటువంటి వార్త వినిపిస్తుందోనని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కేంద్రం నుంచి చంద్రబాబు ఏ మేర హామీలు సాధించారన్న విషయంపైనా సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News