: పిన్నమనేని... అవుటాఫ్ డేంజర్!: ఆరోగ్యం నికలడగానే ఉందన్న అపోలో డాక్టర్లు
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ వద్ద నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పిన్నమనేని కారు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పిన్నమనేని భార్య సాహిత్యవాణి, డ్రైవర్ దాసు అక్కడికక్కడే చనిపోయారు. సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా ఘోర ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ పిన్నమనేనిని పోలీసులు హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వెనువెంటనే చికిత్స మొదలుపెట్టిన అక్కడి వైద్యులు కొద్దిసేపటి క్రితం పిన్నమనేని ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. పిన్నమనేని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు... ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్టేనని (అవుటాఫ్ డేంజర్) ప్రకటించారు.