: జగన్‌ దీక్ష చేస్తే కేసీఆర్‌ ఇంటి వద్ద చేయాలి, లేదంటే ఢిల్లీలో కొన‌సాగించాలి: కేఈ కృష్ణమూర్తి


తెలంగాణ అక్రమంగా చేపడుతోన్న ప్రాజెక్టులపై తెలుగు దేశం పార్టీ నేతలు నోరు విప్పట్లేదంటూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ చేస్తోన్న వ్యాఖ్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈరోజు కర్నూలు జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు ఎలా ప్రతిస్పందించాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. జగన్ దీక్ష చేయాల్సింది కర్నూలులో కాదని, కేసీఆర్‌ ఇంటి వద్ద చేయాలని లేదా ఢిల్లీలో కొనసాగించాలని ఆయన అన్నారు. అప్పుడే జగన్ చేసే దీక్ష వ‌ల్ల రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రో వైపు తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావుపైన కూడా కేఈ కృష్ణ‌మూర్తి స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. హ‌రీశ్‌రావుకి నోటి దురుసు ఎక్కువ‌గా ఉంద‌ని కేఈ కృష్ణ‌మూర్తి విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News