: కేన్స్ లో ఆకట్టుకున్న హీరో రామ్ బాబాయి కొడుకు నిషాంత్ '60 ఎయిట్'!
ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తమ్ముడి కుమారుడు, హీరో రామ్ బాబాయి కొడుకు పోతినేని రాజా నిషాంత్ ఆకట్టుకున్నాడు. ఆయన నిర్మించిన షార్ట్ ఫిల్మ్ '60 ఎయిట్' సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. రవికిశోర్ చిన్న తమ్ముడు డాక్టర్ రమేష్ బాబు కుమారుడైన నిషాంత్, ఎనిమిది సంవత్సరాల బాలుడి చుట్టూ తిరిగే కథతో 15 నిమిషాల నిడివి గల చిత్రం తీశాడు. ఈ చిత్రం లఘు చిత్రాల విభాగంలో కేన్స్ లో ప్రవేశం పొంది విమర్శకుల ప్రశంసలు పొందుతోంది.