: పద్దుల చిట్టాతో ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ విమానం ఎక్కేశారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన చంద్రబాబు మరికాసేపట్లో హస్తినలో ల్యాండ్ కానున్నారు. మంత్రులెవరూ వెంట రాకుండానే కేవలం ఒకరిద్దరు కీలక శాఖల అధికారులను వెంటబెట్టుకుని విమానం ఎక్కిన చంద్రబాబు... మోదీ ముందు పెట్టాల్సిన పద్దుల చిట్టాలను కూడా వెంట తీసుకెళుతున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు పార్టీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు... నేటి సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. కరవుపై చర్చ తర్వాత ప్రత్యేక హోదాపై ఆయన మోదీతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఢిల్లీలోనే మీడియా సమావేశంలో మాట్లాడి తిరిగి విజయవాడ బయలుదేరతారు.

  • Loading...

More Telugu News