: ఏపీ కేబినెట్ మంత్రులను షాక్ కు గురి చేసిన యాక్సిడెంట్... పిన్నమనేనికి పరామర్శల వెల్లువ


హైదరాబాదులోని శివారు ప్రాంతం తుక్కుగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏపీ కేబినెట్ మంత్రులను షాక్ కు గురిచేసింది. విజయవాడ నుంచి హైదరాబాదు బయలుదేరిన టీడీపీ సీనియర్ నేత, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలు కాగా ఆయన సతీమణి సాహిత్యవాణి, కారు డ్రైవర్ చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు వెనువెంటనే పూర్తి వివరాలపై ఆరా తీశారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల వారిద్దరూ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News