: 'హోదా'కు ప్రత్యామ్నాయం అడుగుదామన్న సుజనా!... ఆ మాట బయటెక్కడా మాట్లాడొద్దన్న చంద్రబాబు


ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి సన్నాహకంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న విజయవాడలో పార్టీ నేతలతో జరిపిన ప్రత్యేెక సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరి చేసిన వాదన అక్కడి వారిని షాక్ కు గురి చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తు చేసిన సుజనా... ప్రధానితో భేటీలో ప్రత్యామ్నాయాన్ని ప్రస్తావిస్తే బాగుంటుందేమోనని చంద్రబాబుకు సూచించారు. దీనిపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేయడంతో పాటు సుజనాకు ఘాటు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ‘‘వాళ్ల వాదన వాళ్లకుంటుంది. మనం మాత్రం ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకునే సమస్య లేదు. అది కావాల్సిందే. ప్రత్యామ్నాయం ఆలోచనే వద్దు. బయట ఎక్కడా అలా మాట్లాడవద్దు’ అని సుజనాకు చంద్రబాబు గట్టిగా చెప్పారట.

  • Loading...

More Telugu News