: ఔటర్ పై ఘోర ప్రమాదం... పిన్నమనేనికి తీవ్ర గాయాలు, సతీమణి దుర్మరణం
హైదరాబాదు చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై నేటి ఉదయం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుక్కుగూడ దగ్గర వేగంగా వెళుతున్న ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలు కాగా... ఆయన సతీమణి సాహిత్యవాణి చనిపోయారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం పాలయ్యాడు. గాయపడ్డ పిన్నమనేనిని పోలీసులు హుటాహుటిన జూబ్లీహిల్స్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సతీసమేతంగా పిన్నమనేని విజయవాడ నుంచి హైదరాబాదు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.