: భార్యతో గొడవపడి బ్లేడుతో దాడి... ఆపై తన గొంతు కోసుకున్న భర్త


మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఆమెపై బ్లేడుతో దాడి చేసి, ఆపై తనను తాను కోసుకున్న సంఘటన హైదరాబాద్ లో ఈరోజు జరిగింది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మాన్ ఘడ్ లో ఓ సైకో భర్త వెంకటేష్ మద్యం తాగి తన భార్య దేవితో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన వెంకటేష్ తన గొంతు కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న వ్యక్తులు వెంకటేష్ ను సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News