: 15 ఏళ్ల రికార్డుకు బ్రేక్...పుదుచ్చేరి 'హస్త'గతం?
15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామికి షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్ సీ) కి ప్రజలు షాకివ్వనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్-డీఎంకే కూటమి 14 స్థానాలు, ఏఐఎన్‌ఆర్‌సీ 9 స్థానాల్లో, అన్నాడీఎంకే 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారని 'సీ ఓటర్' సర్వే తెలిపింది. ఇండియా టుడే కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్‌ఆర్‌సీ 8-12, అన్నాడీఎంకే 1-4 స్థానాల్లో విజయం సాధించనున్నాయని తెలిపింది.