: ఏపీ రాజధాని నిర్మాణానికి అన్ని కోట్లు ఎందుకు?: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలోని బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో విభజించబడిన ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. జార్ఖాండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, ఇలా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటిల్లో ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని ఆయన చెప్పారు. ఏపీ రాజధాని కోసం మాత్రం లక్షల కోట్ల రూపాయలు అడగడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ భూములను ఉచితంగా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అలాంటి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ బీజేపీ అభివృద్ధి సిద్ధాంతమని ఆయన చెప్పారు. ఒకే చోట నిధులు ఖర్చు చేయాలనుకోవడం లేదని ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రోడ్ల నిర్మాణానికి నితిన్ గడ్కరీ నిధులు కేటాయించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News