: కేరళలో ఉమెన్ చాందీకి షాక్ తగలనుందా?


కేరళలో పోలింగ్ ముగిసింది. కేరళలో కమ్యూనిస్టులు మరోసారి సత్తాచాటే అవకాశం కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎల్డీఎఫ్ వైపు ఎగ్జిట్ పోల్స్ మొగ్గుచూపుతున్నాయి. ఎల్డీఎఫ్ 88 నుంచి 101 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఈ ఫలితాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో యూడీఎఫ్ ప్రభుత్వం సోలార్ కుంభకోణంలో మునిగి తేలడం ఆ పార్టీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విద్యావంతులైన కేరళీయులు ఎల్డీఎఫ్ వైపు మొగ్గుచూపినట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో యూడీఎఫ్ కు 38 నుంచి 48 స్థానాలు దక్కుతాయని తెలిపాయి. ఇదే సమయంలో ఈ రాష్ట్రంలో హడావుడి చేసిన బీజేపీకి చుక్కెదురు కానుంది. ఈ రాష్ట్రంలో కనీసం 3 స్థానాల్లోనైనా విజయం సాధించగలిగితే బీజేపీ విజయం సాధించినట్టేనని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

  • Loading...

More Telugu News