: అసోం బీజేపీదే...ఎగ్జిట్ పోల్స్ లో సత్తాచాటిన బీజేపీ
అసోం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల ఆరంభంలో ముగిసిన అసోం ఎన్నికల ఫలితాలపై అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో అసోంలో బీజేపీ పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియాటుడే-యాక్సిస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 79 నుంచి 93 స్థానాలు గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసోంలో సుదీర్ఘకాలం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కేవలం 26 నుంచి 33 సీట్లకు పరిమతం కానుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మూడో పార్టీగా బరిలో దిగిన ఏఐడీయూడీఎఫ్ కేవలం 6 నుంచి 10 స్థానాలను గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇండిపెండెంట్లు 1 నుంచి 4 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో మళ్లీ మోదీ గాలి అసోంను పట్టికుదిపేసిందని చెప్పవచ్చు.