: పాలేరులో 88 శాతం ఓటింగ్ నమోదు
తెలంగాణలోని పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు భారీ ఎత్తున చేసిన ప్రచారానికి, నేడు ప్రజలు తీర్పునిచ్చారు. ఉదయం 7 గంటలకు పాలేరులో పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 88 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు ఆసక్తిగా పాలుపంచుకున్నారు. ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో సాయంత్రం 6 గంటలకు 88 శాతం పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవడంతో టీఆర్ఎస్ ఉత్సాహంగా ఉంది.