: ఎడ్మ కిష్టారెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నాం.. ఇకపై వైసీపీలో తెలంగాణ నాయకులు ఒక్కరూ ఉండొద్దు: ఎంపీ బూర నర్సయ్య గౌడ్
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల దీక్షకు దిగిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు నీరందించేలా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్షకు దిగడం దుర్మార్గమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోన్న వైసీపీ లాంటి పార్టీలో ఇకపై తెలంగాణ నాయకులు ఒక్కరూ ఉండకూడదని ఆయన అన్నారు. జగన్ జలదీక్షను తీవ్రంగా వ్యతిరేకించి వైసీపీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బూర నర్సయ్య పేర్కొన్నారు.