: బాలీవుడ్ భామలకు నేపాల్ 'సైనిక స్వాగతం'... విమర్శల వెల్లువ!


ఎంత అందమైన భామలైనా, దేశాధ్యక్షులకు, వీవీఐపీలకు మాత్రమే పరిమితం చేయాల్సిన సైనిక స్వాగతాన్ని ఇచ్చి రెడ్ కార్పెట్ వేయడం నేపాల్ సైనికాధికారులపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. దీనిపై వివరణ కోరాల్సిందేనని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, నేపాల్ ఆర్మీ అధిపతి రాజేంద్ర చెత్రీ భార్య ఓ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, అందులో పాల్గొనేందుకు హీరోయిన్లు సోనాక్షీ సిన్హా, మలైకా అరోరాలు నేపాల్ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. వీరికి అద్భుత ఆతిథ్యాన్ని, మరచిపోలేని అనుభూతులను పంచాలని అనుకున్నారో ఏమో, రాజేంద్ర సతీమణి దగ్గరుండి సైనిక ఉన్నతాధికారులతో స్వాగతం ఇప్పించారు. దీంతో సైన్యం పరువు పోయిందని వస్తున్న విమర్శనాస్త్రాలు పెరగడంతో, వివరణ ఇవ్వాలని ప్రధాని కార్యాలయం రక్షణ శాఖను ఆదేశించింది.

  • Loading...

More Telugu News