: ‘నీట్’పై అభ్యంతరాలున్నాయి, అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి: నీట్‌పై కీల‌క భేటీలో జేపీ నడ్డా


ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ ‘నీట్’పై ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతోన్న నేప‌థ్యంలో ఈ ప్రవేశ పరీక్ష‌ నిర్వహణపై ఢిల్లీ ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన అన్ని రాష్ట్రాల వైద్య, విద్యాశాఖ మంత్రులు, అధికారులు భేటీ అయ్యారు. నీట్ నిర్వ‌హ‌ణ‌పై విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి తలెత్తిన సందేహాలు, సమస్యలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. నీట్‌కు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని తెలిపారు. నీట్‌పై ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని, ప్రాంతీయ భాష‌ల్లోనూ ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. నీట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ సిలబస్‌లపై విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు త‌మ‌కు తెలిసింద‌ని, రాష్ట్రాల అభ్యంతరాలను సుప్రీం దృష్టికి తీసుకెళ‌తామ‌ని జేపీ న‌డ్డా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News