: తిరుమలలో కనిపించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జెండా!
దేవదేవుడు కొలువై, దివ్య హిందూ పుణ్య క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో ఐఎస్ఐఎస్ జెండా కనిపించడం కలకలం రేపింది. తిరుమలలోని జాపాలీ తీర్థానికి వెళ్లే రహదారిలో ఓ వర్గం వారికి చెందిన జెండాలతో పాటు ఐఎస్ఐఎస్ జెండా కనిపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాటిని తొలగించినట్టు తెలుస్తోంది. ఈ జెండాలను తిరుమలకు ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? వారి ఉద్దేశమేంటన్న విషయమై దర్యాఫ్తు చేస్తున్నట్టు టీటీడీ అధికారి ఒకరు తెలిపారు.