: ఉజ్బెక్ యువతిని 'ఫేస్ బుక్ ప్రేమ' పేరిట రప్పించి అమ్మేసిన ఢిల్లీ దుర్మార్గుడు!


తనకు పరిచయమైన ఓ విదేశీ యువతిని ప్రేమ పేరిట ఇండియాకు రప్పించి, ఆపై అత్యాచారం చేయడంతో పాటు, భార్యతో కలిసి బలవంతంగా వ్యభిచారం చేయించిన దుర్మార్గమైన ఉదంతమిది. అతని చెర నుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. వసంత్ కుంజ్ ఏరియాకు చెందిన అల్తాఫ్ అలియాస్ రాజు (34) అనే వ్యక్తికి ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి గత సంవత్సరం మే నెలలో సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. ఆమెతో పరిచయాన్ని ప్రేమ వరకూ తీసుకెళ్లి, ఆపై ఇండియాకు వస్తే, వివాహం చేసుకుని, వ్యాపారం చేద్దామని ఆశ చూపించాడు. అల్తాఫ్ ను నమ్మిన ఆ యువతి ఇండియాకు రాగా, ఓ హోటల్ లో ఉంచి, మాయమాటలు చెబుతూ తన కోరిక తీర్చుకున్నాడు. తన చర్యలను వీడియో తీసి, బెదిరించాడు. తనకు పెళ్లైన విషయాన్ని చెప్పి భార్యను పరిచయం చేశాడు. ఆపై ఆమె పాస్ పోర్టు, తెచ్చుకున్న డబ్బు లాక్కొన్న వారిద్దరూ, యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టేశారు. రెండు రోజుల క్రితం వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి అల్తాఫ్ భార్య అంజలిని అరెస్ట్ చేశామని, అల్తాఫ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News