: చుక్క నీటినయినా ఏపీ నుంచి తీసుకోవట్లేదు: హరీశ్ రావు ఆగ్రహం
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడు రోజుల దీక్షను చేపడుతోన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు దీనిపై తీవ్రంగా స్పందించారు. కొద్ది సేపటి క్రితం ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ... ఒకరు సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మీద కేసులు పెడుతుంటే, మరొకరు దీక్షలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చుక్క నీటినయినా ఏపీ నుంచి తీసుకోవట్లేదని, జగన్ దీక్షకు దిగడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు నీళ్లు మళ్లించి తెలంగాణకు అన్యాయం చేశారని, అది నిజం కాదా? అని హరీశ్ రావు జగన్ ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ఉసురు పోసుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు.