: 27వ దీక్ష ఇది... ఎంతో లక్కీ అంటున్న వైకాపా!


రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ చేపట్టిన 27వ దీక్ష ఇదని, 2, 7 కలిపితే 9 రావడం పార్టీకి అదృష్టమని వైకాపా అంటోంది. కర్నూలులో చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన రాగా, జగన్ సైతం ఉత్సాహంగా సభా వేదికకు చేరుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగిస్తూ, జగన్ దీక్షతో ప్రభుత్వం దిగిరావడం ఖాయమని, ఇక్కడికి వచ్చిన ప్రజలను, పార్టీ కార్యకర్తలనూ చూస్తుంటే, దీక్ష ప్రారంభం కాకుండానే విజయవంతమైందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఎదుర్కొంటామని తెలిపారు. 27వ దీక్ష చంద్రబాబుకు కనువిప్పు కలిగించే దీక్ష కావాలని కోరుకుంటున్నట్టు వివరించారు. కాగా, మూడు రోజుల దీక్ష కోసం జగన్ కొద్దిసేపటి క్రితం వేదిక వద్దకు చేరుకోగా, పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన జగన్, నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News