: వైఎస్ జగన్ కు మరో షాక్!... జలదీక్షకు నిరసనగా పార్టీకి ఎడ్మ కిష్టారెడ్డి రాజీనామా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా జగన్ నేటి నుంచి కర్నూలులో మూడు రోజుల పాటు జలదీక్ష పేరిట ధర్నాకు దిగుతున్నారు. జగన్ ధర్నాను తీవ్రంగా పరిగణించిన పార్టీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి ఆయనకు షాకిచ్చారు. దీక్ష కోసం తన సొంతూరు పులివెందుల నుంచి జగన్ కర్నూలుకు బయలుదేరిన మరుక్షణమే హైదరాబాదులో ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. దీంతో దీక్షతో ఏపీలో కొంతమేర లబ్ధి చేకూరుతుందని భావించిన జగన్ కు... తెలంగాణలో పెద్ద షాకే తగిలినట్లైంది.