: ఐలయ్య వ్యాఖ్యలపై ఐవైఆర్ ఫైర్!... సోమరిపోతుల అడ్రెస్ లిస్తే దండిస్తామని కౌంటర్!


బ్రాహ్మణులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జాతీయ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణులు తిని కూర్చొనే సోమరులంటూ శుక్రవారం విజయవాడ కేంద్రంగా ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై ఐవైఆర్ నిన్న నెల్లూరులో స్పందించారు. బ్రాహ్మణుల్లో సోమరిపోతులు ఎవరైనా ఉంటే వారి అడ్రెస్ లివ్వాలని డిమాండ్ చేసిన ఐవైఆర్... అలాంటి వారిని దండిస్తామని ఐలయ్యకు కౌంటరిచ్చారు. ‘‘నేను 35 ఏళ్ల పాటు ప్రభుత్వంలో పనిచేశాను. ఏనాడూ సోమరిని అనిపించుకోలేదు. అలాగే రాష్ట్రంలో ఏ బ్రాహ్మణుడు సోమరి కాదు. వారి రంగాల్లో బ్రాహ్మణులు నిత్య శ్రామికులే. బ్రాహ్మణుల్లో ఎవరైనా సోమరిగా ఉంటే... వారి అడ్రెస్ లు ఇవ్వండి. వారిని మేం దండిస్తాం’’ అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News