: ఓటేసిన రజనీకాంత్!... సంప్రదాయ పంచెకట్టులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన సూపర్ స్టార్!


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సంప్రదాయ పంచెకట్టులో చెన్నైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీకాంత్ నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. పోలింగ్ సిబ్బంది వద్ద వేలికి ఇంకు గుర్తును వేయించుకున్న రజనీ... తన ఓటు హక్కును వినియోగిస్తున్నట్లు సంతకం చేసి ఆ తర్వాత తన ఓటును వేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉదయమే తన ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చే రజనీకాంత్... జనం తక్కువగా ఉన్నప్పుడే ఓటు వేసి వెళుతుంటారు. ఈ దఫా కూడా ఆయన జనం రద్దీ మొదలు కాకముందే తన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీకాంత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రజనీకాంత్... అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News