: హీరోయిన్లతో హైట్ విషయంలో చాలా ఇబ్బంది...శ్రుతి అయితే ఓకే: విశాల్


తన ఎత్తుకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదని నటుడు విశాల్ ఫీలవుతున్నాడు. 'రాయుడు' సినిమా ప్రమోషన్ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, హీరోయిన్లు ఎత్తున్న వారు దొరకడం లేదని అన్నాడు. శ్రీదివ్య హైట్ తో తనకు ఇబ్బంది రాలేదు కానీ, కెమెరా మెన్ కు ఇబ్బంది ఎదురైందని చెప్పాడు. ఇద్దర్నీ ఫ్రేంలో మ్యాచ్ చెయ్యడం కాస్త ఇబ్బందవుతుందని అన్నాడు. ఫ్రేంలో తానొక్కడే ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదని, యాపిల్ మొబైల్ ను ఎదురుగా పెట్టుకుని డైలాగ్ చెప్పేస్తానని అన్నాడు. కాంబినేషన్ సీన్లు ఉన్నప్పుడు మాత్రం ఇద్దర్నీ మ్యాచ్ చేయడం కెమెరామెన్ కు ఇబ్బంది అవుతుందని విశాల్ పేర్కొన్నాడు. తనతో నటించిన హీరోయిన్లలో హైట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేనిది శ్రుతి హాసన్, రీమాసేన్ తోనని విశాల్ తెలిపాడు. వారిద్దరితో సౌకర్యంగా ఉంటుందని విశాల్ చెప్పాడు. తన ఈ హైట్ కు తగ్గ అమ్మాయి కావాలని కోరడం కూడా అత్యాశేనని విశాల్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News