: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పుతిన్, ట్రంప్ గాఢ అధరచుంబనం పెయింట్


సోషల్ మీడియాలో ఓ పెయింట్ హల్ చల్ చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ గా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ గాఢ అధరచుంబనంలో మునిగి ఉన్న పెయింట్ ను బార్బెక్యూ రెస్టారెంట్‌ వద్ద స్థానిక కళాకారుడు మిండాగాస్ బోనావూ పెయింటింగ్ వేశారు. రష్యా, అమెరికాలకు చెందిన 'ఈ హీరో లిద్దరి (పుతిన్, ట్రంప్) మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని, వీరిద్దరికీ ఇగో ఉందని, వీరిని కలిపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోంచి ఈ ఫోటో పుట్టిందని మిండాగాస్ బోనావూ తెలిపారు. ఈ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు ఆయన 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అనే క్యాప్షన్ జోడించారు. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ ప్రచార స్లోగన్ 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్'‌కు ఇది దగ్గరగా ఉండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, 1979లో సోవియట్ నేత లియోనిడ్ బ్రెజ్‌నెవ్, తూర్పు జర్మనీ అధ్యక్షుడు ఎరిక్ హోనెక్కర్ లు కలిసినప్పుడు ఆ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఓ ఫోటో హల్ చల్ చేసింది. ఆ ఫోటోకు ఈ పెయింటింగ్ కు దగ్గరి పోలికలు ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News