: మరోసారి అమ్మపై ప్రేమను కురిపించిన ప్రధాని మోదీ


ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్న నానుడిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిజం చేశారు. తాజాగా మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పెట్టారు. మోదీ ప్రధానిగా ఎన్నికైన అనంతరం ఆయన తల్లి హీరాబెన్ కుమారుడితో కొన్ని రోజులు గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని నివాసంలోని పరిసరాలను తల్లికి మోదీ దగ్గరుండి చూపించారు. ఢిల్లీలోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ప్రధాని అధికార నివాసం నుంచి నేడు ఆమె గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చాలా కాలం తరువాత తల్లితో ఎక్కువ సమయం గడిపానని మోదీ ట్వీట్ చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన దగ్గరికి ఆమె రావడం ఇదే తొలిసారని ట్విట్టర్లో పేర్కొన్నారు. మోదీ పెట్టిన ఫోటోలకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News