: తొలిసారి 179 భారీ స్కోరు సాధించిన పంజాబ్...సెంచరీ మిస్సయిన అమ్లా
ఐపీఎల్ సీజన్ 9లో పంజాబ్ బ్యాట్స్ మన్ తొలిసారి జూలు విదిల్చారు. ఇప్పటికే ముంబైకి షాకిచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించారు. గత మ్యాచుల్లో నిలకడగా ఆడిన ఓపెనర్, కెప్టెన్ మురళీ విజయ్ (6) ఆదిలోనే అవుట్ కావడంతో ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించింది. అయితే మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లా (96) కు సాహా (27), గురుకీరత్ సింగ్ (27), మిల్లర్ (20) సహకరించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాదు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా, హెన్రిక్స్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. 180 పరుగుల విజయ లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.