: 'మేమంతా మీ చుట్టాలం బాబు' అని వాళ్లంతా అన్నప్పుడు ఎంత ఆనందమేసిందో చెప్పలేను!: మహేష్ బాబు
'నెనెప్పుడూ కలవని వారొచ్చి 'మేమంతా మీ చుట్టాలం బాబు' అంటే ఎంత బాగుంటుందో తెలుసా?' అని ప్రిన్స్ మహేష్ బాబు అన్నాడు. తాజాగా బుర్రిపాలెం వెళ్లినప్పుడు 'ఇంట్లో అందరితో మాట్లాడి కిందికి దిగుతున్నప్పుడు ఓ పది హేను మంది మహిళలు అక్కడ ఉన్నారు. వారంతా వచ్చి మేము మీ చుట్టాలం బాబు అని అన్నారు. వారంతా చాలా కొత్తగా ఉన్నారు. నేనెప్పుడూ వారిని కలవలేదు. వీరంతా నావాళ్లు అనుకోగానే ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను' అని మహేష్ బాబు గుర్తు చేసుకున్నాడు. మన కుటుంబం అన్న ఫీలింగ్ చాలా బలమైనదని, వెంటనే వారందరితో మాట్లాడానని మహేష్ బాబు చెప్పాడు. 'బ్రహ్మోత్సవం' కథతో సినిమా చేస్తున్న సమయంలో 'నా మూలాలు కలిగిన బుర్రిపాలెం వెళ్లడం ఎంతో ఆనందంగా ఉంద'ని చెప్పాడు. బంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్న సమయంలో బంధాల విలువ తెలిపేలాంటి సినిమా చేశామని మహేష్ చెప్పాడు. శ్రీకాంత్ అడ్డాల ఈ కథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించిందని మహేష్ బాబు తెలిపాడు. కుటుంబ బంధాలు బలంగా ఉండాలని మహేష్ బాబు తెలిపాడు.