: డ్రీమ్ గర్ల్ హేమమాలినిపై కేసు నమోదు


బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ఎంపీగా ఉన్న హేమమాలిని తాజాగా బాన్సిబట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాంట్ మూలా గ్రామ ప్రధాన్ (సర్పంచ్) భగవతీదేవి భర్త భగవాన్ సింగ్ ను దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హేమమాలిని తీరుకు నిరసనగా గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హేమమాలిని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భగవాన్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టామని అన్నారు.

  • Loading...

More Telugu News