: మీరు ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించడానికి అమెరికాలో ఏ సిటీ మంచిది?...సర్వే వివరాలు


గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలు, మంచి ఆఫర్లు నోరూరిస్తుంటాయి. అయితే ఎక్కడి నుంచి కెరీర్ ను ప్రారంభించాలనే సమస్య ఉత్తమ విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేసిన వారిని వేధించే ప్రధాన సమస్య. అయితే వాలెట్ హబ్ సరికొత్త సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నూతన ఉద్యోగుల జీవితం ఆయా సిటీల్లో ఎలా ఉంటుంది? కెరీర్ ప్రారంభించే ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు ఏవి? జీవితంలో మరింత ఎదిగేందుకు, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఈ నగరాలు అనువైనవా? కావా? వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని వాలెట్ హబ్ ఈ అధ్యయనం చేపట్టింది. 16 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ప్రతి లక్ష మంది జీవించే ప్రాంతాల్లో ఉద్యోగావకాశాల శాతం ఎంత? ఆరంభ జీతం, వార్షిక వృద్ధి రేటు, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగుల రేటు, సొంత వ్యాపారాల పరిస్థితులు, జీవన నైపుణ్యం, మధ్యతరగతి వారికి గృహాల ధరలు అందుబాటులో ఉన్నాయా? లేదా?, ఆయా నగరాల్లో జనాభా వృద్ధి రేటు ఎలా ఉంది, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి సంఖ్య వంటివన్నీ పరిగణనలోకి తీసుకున్న వాలెట్ హబ్ రూపొందించిన ఈ జాబితాలో సాల్ట్ లేక్, ఉతాహ్ నగరాలు ఉద్యోగ కెరీర్ ప్రారంభించడానికి అనువైన స్థలాలుగా అగ్ర భాగాన నిలిచాయి. డెన్వర్, కొలరాడో రెండో స్థానంలో నిలవగా, ఆస్టిన్, టెక్సాస్ మూడవ స్థానంలో నిలిచాయి. సూ ఫాల్స్, సౌత్ డకోటా నగరాలు నాలుగో స్థానంలోనూ, మినియాపాలిస్, మిన్నెసోటా టాప్-5గా జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అయితే డెట్రాయిట్ నగరంలో కెరీర్ ను ప్రారంభించడమంత చెత్తపని ఇంకోటి లేదని ఈ జాబితా తెలిపింది. కాలిఫోర్నియా, ఫ్రెస్నో, ఫ్లొరైడ్ సిటీ వరస్ట్ నగరాలుగా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. దీంతో అమెరికాలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారు వీటిని గుర్తించాలని వాలెట్ హబ్ చెబుతోంది.

  • Loading...

More Telugu News