: విశాఖలో కొత్త రకం డ్యాన్స్ ఆక్వా జూంబా!... క్యూ కడుతున్న మహిళలు
సాగర నగరం విశాఖపట్నంలో కొత్త రకం డ్యాన్స్ రంగ ప్రవేశం చేసింది. ఆక్వా జూంబా పేరిట సరికొత్త రీతిలో ఎంటరైన ఈ డ్యాన్స్ అక్కడి మహిళలు, యువతులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్విమ్మింగ్ పూల్ లో నడుము లోతు వరకు నీటిలో దిగి... ఇన్ స్ట్రక్టర్ చెప్పే నృత్య రీతులను అలవోకగా అనుకరిస్తున్న అక్కడి మహిళలు తమ శరీరంలోని అధిక బరువును ఇట్టే తగ్గించుకునేందుకు నడుం కట్టారు. సాంతం నీటిలో దాదాపు రెండు గంటలకు పైగా ఏకబిగిన సాగే ఈ ఆక్వా జూంబా డ్యాన్స్ లో శారీరక శ్రమ పెద్దగా లేకుండానే శరీరంలోని కొవ్వు శాతం సులువుగా కరిగిపోతుందట. ఇప్పటికే పదుల సంఖ్యలో విశాఖ మహిళలు ఆక్వా జూంబాతో సందడి చేస్తుండగా, ఈ కొత్త రకం డ్యాన్స్ చేసేందుకు మరింత మంది మహిళలు క్యూ కడుతున్నారట.