: ‘గుంటూరు’ మృతులకు రూ.20 లక్షల పరిహారం... బాధ్యులపై కఠిన చర్యలు: రావెల ప్రకటన


గుంటూరులోని లక్ష్మీపురంలో నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రావెలకు కూలీల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అయినా ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంపై సహచర మంత్రులతో చర్చించిన ఆయన అక్కడికక్కడే పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆయన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రావెల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News