: ఏపీ మంత్రి రావెలకు చేదు అనుభవం... గుంటూరులో మంత్రి కారుపై కూలీల దాడి
ఏపీ కేబినెట్ లో సీనియర్ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబుకు నిన్న రాత్రి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో చోటుచేసుకున్న ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి అక్కడకు హుటాహుటిన వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యేలా ఆయన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన కూలీలు మంత్రి కారుపై విరుచుకుపడ్డారు. చేతికందిన రాళ్లను మంత్రి కారుపై విసిరారు. ఈ దాడిలో మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరామర్శించేందుకు వస్తే... ఇదేం దాడి? అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.