: ఢిల్లీలో మరో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి!
రోజు రోజుకు దేశ రాజధాని అత్యాచారాలకు అడ్డాగా మారిపోతుంది. వారం రోజుల కిందటే ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈలోపే 6 సంవత్సరాల మరో చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని బాదర్పూర్ ప్రాంతంలోని ప్రజా మరుగుదొడ్డిలో బాలికపై ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో తీవ్రగాయాలైన చిన్నారి ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు దీని గురించి వెల్లడిస్తూ .. తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. మెడపై గాయాలైనట్లు కనపడుతోందనీ, ఆ సమయంలో ఒంటిపై వస్త్రాలు లేకుండా ఉందని బాలిక మావయ్య వెల్లడించారు. ఈ ఘటనలో 22 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తుండగా, మరుగుదొడ్డి కాంట్రాక్టర్ ను నిర్భంధించినట్లు తెలిపారు. బాధితురాలి తండ్రి ఢిల్లీలో బెలూన్లు అమ్ముతుంటాడు.