: హోదాపై జగన్ దీక్ష చేయాలి, బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలి: చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి చినరాజప్ప అన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై తాము పోరాడుతూనే ఉన్నామని, ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు ఆపబోదని తెలిపారు. బీజేపీ ఏపీ నేతలు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని చినరాజప్ప అన్నారు. వైసీపీ అధినేత ఏపీపై విమర్శలు చేయడం ఆపి, హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పట్ల తమ పార్టీ వెనకడుగు వేయబోదని చినరాజప్ప చెప్పారు.